సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో సాంకేతికత భారత్‌కు సాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'అన్‌లీషింగ్ ది పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్ టెక్నాలజీ'పై పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. డిజిటల్ విప్లవం వల్ల కలిగే ప్రయోజనాలు పౌరులందరికీ చేరేలా రూపొందించబడుతున్న భారీ, ఆధునిక మౌలిక సదుపాయాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. డిజిటల్ విప్లవం వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ చేరేలా ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు.
10 సమస్యలను గుర్తించాలి: మదీ
పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తాము సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో భారతీయ పౌరుల జీవితాలలో గుణాత్మకమైన మార్పును తీసుకొస్తామన్నారు. 5జీ, ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి సాంకేతికతలు వైద్యం, విద్య, వ్యవసాయంతో పాటు అనేక ఇతర రంగాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించి పరిష్కరించగల సామాన్యులు ఎదుర్కొంటున్న 10 సమస్యలను గుర్తంచాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.