Goa: పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదం.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పారాగ్లైడింగ్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు వంద అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో ఒక మహిళా పర్యటకురాలు, ఇన్‌స్ట్రక్టర్ మరణించారు.
ఈ ఘటన ఉత్తర గోవాలోని కేరి గ్రామంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన 27 ఏళ్ల మహిళా పర్యాటకురాలు శనివారం సాయంత్రం గోవాలోకి వచ్చింది.
సుమల్ నేపాలీ అనే 26 ఏళ్ల ఇన్‌స్ట్రక్టర్ సాయం తీసుకుని పారాగ్లైడింగ్ ప్రారంభించింది. వారు 100 అడుగుల ఎత్తులో పట్టుతప్పి లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ చట్టవిరుద్ధంగా పారాగ్లైడింగ్‌ను నిర్వహించిందని పోలీసులు తెలిపారు.
Details
కంపెనీ యజమానిపై కేసు నమోదు
కంపెనీ యజమాని శేఖర్ రైజా పై కేసు నమోదు చేశామని తెలియజేశారు.
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కూడా శుక్రవారం రెండు వేర్వేరు పారాగ్లైడింగ్ ప్రమాదాల్లో ఇద్దరు పర్యాటకులు మరణించారు.
కాంగ్రా, కులు జిల్లాల్లో గార్సా ల్యాండింగ్ సైట్ సమీపంలో ఒక పారాగ్లైడర్ మరో పారాగ్లైడర్‌ను ఢీకొనడం వల్ల తమిళనాడుకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
అదే రోజు ధర్మశాల సమీపంలోని ఇంద్రునాగ్ సైట్‌లో టేకాఫ్ అవుతుండగా, పట్టుతప్పి పడిపోయిన ఘటనలో గుజరాత్‌కు చెందిన వ్యక్తి మరణించాడు.