
ఇది ప్రపంచానికి కొత్త దిశను చూపే సమయం: జీ20 స్వాగత ప్రసంగంలో ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ప్రగతి మైదాన్‌లోని 'భారత్ మండపం'లో జీ20 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత ప్రారంభమైంది. మోదీ ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు.
21వ శతాబ్దం అనేది ప్రపంచానికి నూతన దిశను చూపే సమయని మోదీ అన్నారు.
ప్రపంచంలో విశ్వాస సంక్షోభం ఏర్పడిందని స్పష్టం చేశారు. కోవిడ్-19 తర్వాత ప్రపంచంలో విశ్వాసం కొరవడిందని, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అది మరింత దిగజారిందన్నారు.
కరోనాను పూర్తిగా జయించడం ద్వారా విశ్వాసం ఆ లోపాన్ని పూర్తిగా జయించాలని యావత్ ప్రపంచానికి భారత్ విజ్ఞప్తి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
పాత సవాళ్లు కొత్త పరిష్కారాలను కోరే సమయం ఆసన్నమైందన్నారు. అందుకే మన బాధ్యతలను నెరవేర్చేందుకు మానవ కేంద్రీకృత విధానంతో ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు.
మోదీ
టార్చ్ బేరర్‌గా 'సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్'
మొరాకోలో సంభవించిన భూకంపంపై ప్రధాని మోదీ జీ20 వేదికపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.
ఈ కష్ట సమయాల్లో ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. 'సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' అనే మంత్రం జీ20 సభ్య దేశాలకు టార్చ్‌బేరర్‌గా ఉంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉత్తరం-దక్షిణాల మధ్య విభజన, తూర్పు-పడమరల మధ్య దూరం, ఆహారం, ఇంధనాల నిర్వహణ, తీవ్రవాదం, సైబర్ భద్రత, ఆరోగ్యం, ఇంధనం, నీటి భద్రతల విషయంలో భవిష్యత్తు తరాలకు మంచి పరిష్కారాలను కనుక్కోవాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు.
మోదీ
ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లోకి ఆహ్వానించిన మోదీ
ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత జీ20 సభ్యదేశంగా చేయాలని భారత్ ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ అంగీకరిస్తారని తనకు నమ్మకం ఉందని మోదీ పేర్కొన్నారు.
సభ్య దేశాల మద్దతుతో ఆఫ్రికన్ యూనియన్‌ని జీ20లోకి మోదీ సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మోదీని యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని ఆలింగనం చేసుకున్నారు.
అనంతరం అజాలి అసోమానిని జీ20 హై టేబుల్‌లో కూర్చోవాలని మోదీ ఆహ్వానించారు. చప్పట్ల మధ్య భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసోమనీని తన సీటుకు తీసుకెళ్లారు.
ఆఫ్రికన్ యూనియన్‌లో ఆఫ్రికన్ ఖండంలోని 55దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మోదీ-అసోమాని ఆలింగనం
G 20 in India | President of South Africa Cyril Ramaphosa tweets, "We are delighted that the G20 has accepted the African Union as a member of the G20..." pic.twitter.com/IhvmBOedfr
— ANI (@ANI) September 9, 2023