
భారత్‌లో గత 15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికాన్ని జయించారు: ఐక్యరాజ్య సమితి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం పేదరికాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతిని సాధించినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
కేవలం గత 15 సంవత్సరాల(2005-2006 నుంచి 2019-2021 వరకు)ల్లోనే భారత్‌లో దాదాపు 41.5 కోట్లు మంది పేదరికం నుంచి బయటపడినట్లు ఐరాస అధ్యయనం పేర్కొంది. భారత్ సాధించిన అద్భుతమైన విజయంగా అభివర్ణించింది.
ఐరాసాకు చెందిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (ఓపీహెచ్ఐ) సంయుక్తంగా రూపొందించిన గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ)ని మంగళవారం విడుదల చేశారు.
ఐరాస
భారత్‌లో పేదరికం 55.1 శాతం నుంచి 16.4 శాతానికి తగ్గింది
ఏప్రిల్‌లో 142.86 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను భారతదేశం అధిగమించింది.
భారత్‌తో సహా 25 దేశాలు గత 15 సంవత్సరాల్లో విజయవంతంగా పేదరికాన్ని సగానికి తగ్గించుకున్నాయని ఎంపీఐ నివేదిక చెబుతోంది.
పేదరికాన్ని సగానికిపైగా తగ్గించుకున్న దేశాల జాబితాలో కంబోడియా, చైనా, కాంగో, హోండురాస్, ఇండియా, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం ఉన్నాయి.
పేదరికాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని తాజాగా విడుదలైన ఎంపీఐ నివేదిక నిరూపిస్తోంది.
2005-2006లో భారత్‌లో పేదరికం 55.1 శాతం ఉంటే, 2019-2021లో నాటికి 16.4 శాతానికి పడిపోయినట్లు నివేదిక చెబుతోంది.
2005-2006లో భారతదేశంలో 64.5 కోట్లు మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. 2019-2021 నాటికి ఆ సంఖ్య 23 కోట్లు తగ్గింది.
భారత్
ప్రపంచ పేదల్లో 84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివాసం
110 దేశాలలోని 6.1బిలియన్ల మందిలో 1.1బిలియన్ మంది తీవ్రమైన పేరికంలో పేదరికంలో నివసిస్తున్నారు.
ఇందులో ఎక్కువ మంది సబ్-సహారా ఆఫ్రికా (534 మిలియన్లు), దక్షిణ ఆసియా (389 మిలియన్లు) నుంచి ఉన్నారు. ప్రతి ఆరుగురు పేదల్లో ఐదుగురు ఈ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు.
మూడింట రెండొంతుల మంది పేదలు (730 మిలియన్ల ప్రజలు) మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు.
ప్రపంచ పేదరికాన్ని తగ్గించడానికి ఈ దేశాలలో చర్యలు చాలా అవసరమని ఎంపీఐ అభిప్రాయపడింది.
ఎంపీఐ నివేదికలో పేర్కొన్న పేదవారిలో 566మిలియన్లు మంది 18ఏళ్లలోపు పిల్లలు ఉన్నారు.
పిల్లల్లో పేదరికం రేటు 27.7శాతం కాగా, పెద్దవారిలో ఇది 13.4శాతంగా ఉంది.
మొత్తం పేదల్లో 84శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.