India's space: 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ: కేంద్ర మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇస్రో రాకెట్ ప్రయోగించి 60ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
2040నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. దీనివల్ల శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతావరణం కూడా లభిస్తుందన్నారు.
అంతర్జాతీయ సర్వే సంస్థలు మరింత ఎక్కువ వృద్ధి రేటును అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.
2040 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 100 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని 'ఏకేడీ' వంటి కొన్ని విదేశీ ఏజెన్సీలు అంచనా వేశాయని కేంద్ర మంత్రి అన్నారు.
అంతరిక్షం
వనరుల కొరతను అధిగమిస్తాం: జితేంద్ర సింగ్
ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంతగా ప్రభావవంతంగా లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ప్రస్తుతం 80 లక్షల అమెరికన్ డాలర్లు మాత్రమేని స్పష్టం చేసారు.
ఇస్రో కేవలం విదేశీ ఉపగ్రహ ప్రయోగాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నట్లు చెప్పారు.
యూరోపియన్ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా దాదాపు 230-240 మిలియన్ యూరోలు, అమెరికా ఉపగ్రహాల ప్రయోగం ద్వారా దాదాపు 170-180మిలియన్ డాలర్లను ఇస్రో ప్రస్తుతం ఆర్జిస్తోంది.
భారత అంతరిక్ష వనరుల్లో 70శాతానికి పైగా ప్రభుత్వేతర రంగం నుంచి వస్తున్నాయని జితేంద్ర సింగ్ అన్నారు.
భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రస్తుతం వనరుల కొరత ఉందని, అయితే ఈ లోపాన్ని త్వరలోనే అధిగమిస్తామని పేర్కొన్నారు.