Page Loader
మణిపూర్ అమానుషం: నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ
నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ

మణిపూర్ అమానుషం: నిందితులపై చర్యలకు 2 నెలల ఆలస్యంపై స్పందించిన జిల్లా ఎస్పీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 21, 2023
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

యావత్ దేశాన్నే కుదిపేసిన మణిపూర్ మహిళల నగ్న ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంపై పౌర సంఘాలు మండిపడుతున్నాయి. సదరు నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు రెండు నెలల సమయం ఎందుకు పట్టిందనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా తౌబల్ జిల్లా ఎస్పీ సచ్చిదానంద స్పందించారు. సరైన సాక్ష్యాలు లేకపోవడం కారణంగానే పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని తౌబల్ ఎస్పీ సచ్చిదానంద వెల్లడించారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడ లేరనే ప్రచారం అవాస్తవమని కొట్టిపడేశారు. మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలపై లైంగిక దాడుల ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదును సంబంధిత ఠాణాకు బదిలీ చేసేందుకు నెల రోజులకుపైగా సమయం పట్టింది.

DETAILS

తీవ్రంగా ఖండించిన మణిపూర్ మహిళా గవర్నర్ అనుసూయా ఉయికే

తాజాగా తౌబల్ జిల్లాలోని నాంగ్‌పోక్ సెక్మై ఠాణా పరిధిలో సదరు మహిళలను కిడ్నాప్, గ్యాంప్ రేప్ వంటి దారుణాలకు సంబంధించి మరో ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. భయానక సంఘటన వీడియో బహిర్గతం అయినప్పట్నుంచి మొత్తంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఘటనపై మణిపూర్‌ గవర్నర్‌ అనుసూయా ఉయికే తీవ్రంగా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు చట్టప్రకారం నిందితులపై ఉక్కుపాదం మోపాలని మణిపూర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి ఆదేశాలు జారీ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మణిపూర్ మహిళల నగ్న ఘటన కేసులో నలుగురు నిందితులు అరెస్ట్