Page Loader
మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ప్రధాన నిందితుడు అరెస్టు
మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ప్రధాన నిందితుడు అరెస్టు

మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు.. ప్రధాన నిందితుడు అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2023
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై నరేంద్ర మోదీ స్పందించారు. ఇద్దరు మహిళలపై జరిగిన అమానవీయ ఘటన కలిచి వేసిందని, 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందని పేర్కొన్నారు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు హీరాదాస్(32)ను గత రాత్రి 1.30గంటలకు అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా అందులో గ్రీన్ కలర్ టీషర్ట్ ధరించి హీరాదాస్ కనిపిస్తున్నాడు. ఈ ఘటనపై స్పందించిన మణిపూర్ సీఎం బీరేన్ స్పందించారు. ఈ అమానవీయ ఘటనలోని నిందితులకు ఉరిశిక్ష విధిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిందితులకు ఉరిశిక్ష విధిస్తామని చెప్పిన సీఎం