LOADING...
Actress Kasturi: కాషాయ కండువా కప్పుకున్న సినీనటి కస్తూరి
కాషాయ కండువా కప్పుకున్న సినీనటి కస్తూరి

Actress Kasturi: కాషాయ కండువా కప్పుకున్న సినీనటి కస్తూరి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీనటి కస్తూరి శంకర్‌ అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. కస్తూరితో పాటు నామిస్‌ సౌత్‌ క్వీన్‌ ఇండియా అధ్యక్షురాలు నమితా మారిముత్తు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నైనార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ, సామాజిక కార్యకర్తలైన సినీ నటి కస్తూరి, నమితా మారిముత్తు నేటి నుంచి అధికారికంగా రాజకీయ ప్రయాణం ప్రారంభించడం స్వాగతించదగిన పరిణామమని అన్నారు. కస్తూరి, మోడల్‌గా మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందారు. అలాగే, పలు టెలివిజన్‌ సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకుల మన్నన పొందారు.