సుప్రీంకోర్టుకు అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం, రేపు విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
షార్ట్ షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై 'కుట్ర'కు పాల్పడిందంటూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పీఐఎల్)పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించనుంది. న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ పీఐఎల్‌లు దాఖలు చేశారు.
అమెరికా కేంద్రంగా పని చేసే హిండెన్‌బర్గ్ సంస్థ కుట్రపూరితంగా ఇచ్చిన నివేదిక వల్ల భారత ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోందని ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. భారతీయ స్టాక్ మార్కెట్లు దెబ్బతిని ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన వారు వివరించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారించనుంది.
సుప్రీంకోర్టు
రుజువును సమర్పించడంలో హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు విఫలం: పిటిషనర్
హిండెన్‌బర్గ్ నివేదికపై మీడియా చేసిన ప్రచారం వల్ల మార్కెట్లుగా తీవ్రంగా ప్రభావితమైనట్లు విశాల్ తివారీ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ తన వాదనలకు సంబంధించిన రుజువును భారతీయ నియంత్రణ సంస్థ సెబీకి అందించడంలో విఫలమయ్యారని ఎంఎల్ శర్మ పిటిషన్‌లో వివరించారు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ ద్వారా న్యాయ విచారణ జరిపించాలని పిటిషన్ దారులు కోరారు. హిండెన్‌బర్గ్ నివేదిక దేశ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ను మాత్రమే కాకుండా బిజినెస్‌మన్ల వ్యాపారాలను కూడా ప్రశ్నార్థకం చేసిందన్నారు.
అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపిస్తూ నివేదకను విడుదల చేసింది. దీని వల్ల అదానీ గ్రూప్ స్టాక్స్ రికార్డు స్థాయిలో నష్టపోయాయి.