Loading...
Supreme Court Directs FSSAI: ప్యాకేజ్డ్ ఆహారంపై హై షుగర్, సాల్ట్, ఫ్యాట్ హెచ్చరికలు తప్పనిసరి
ప్యాకేజ్డ్ ఆహారంపై హై షుగర్, సాల్ట్, ఫ్యాట్ హెచ్చరికలు తప్పనిసరి

Supreme Court Directs FSSAI: ప్యాకేజ్డ్ ఆహారంపై హై షుగర్, సాల్ట్, ఫ్యాట్ హెచ్చరికలు తప్పనిసరి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలిపేలా ప్రత్యేక హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 'ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చర్యలు తీసుకోవాలని సూచించింది. అధిక చక్కెర,అధిక ఉప్పు,అధిక కొవ్వు.. ఈ మూడింటికీ వేర్వేరుగా స్పష్టమైన హెచ్చరిక గుర్తులు ఉండాలని తెలిపింది. ఈ పోషక పదార్థాలన్నింటినీ కలిపి ఒకే హెచ్చరిక గుర్తులో చూపించకూడదని స్పష్టం చేసింది. ప్రతి హెచ్చరిక గుర్తును షడ్భుజి(hexagonal)ఆకారంలో రూపొందించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆయా గుర్తుల్లో సంబంధిత పోషక పదార్థానికి సంబంధించిన బొమ్మతో పాటు HIGH SUGAR, HIGH SALT లేదా HIGH FAT అనే పదాలను స్పష్టంగా ముద్రించాలని పేర్కొంది.

వివరాలు 

వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా హెచ్చరికలు

దీనివల్ల ఒక ఆహార ఉత్పత్తిలో ఏ పదార్థం అధికంగా ఉందో వినియోగదారులు సులభంగా గుర్తించగలుగుతారని తెలిపింది.

ఒకే హెచ్చరిక గుర్తు ఉంటే అందులో ఏ పోషక పదార్థం అధికంగా ఉందో తెలుసుకోవడం కష్టమవుతుందని అభిప్రాయపడింది.

అలాగే ప్రతి హెచ్చరిక గుర్తు ప్యాకెట్ ముందు భాగంలోని ప్రధాన ప్రదర్శన ప్రదేశంలో కనీసం 4 నుంచి 5 శాతం స్థలాన్ని ఆక్రమించాలని ఆదేశించింది.

అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా ఈ నిబంధన ఉండాలని పేర్కొంది.

అయితే, ఈ పరిమాణం నుంచి మినహాయింపు ఇవ్వడానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని తెలిపింది.

వివరాలు 

వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా హెచ్చరికలు

షడ్భుజి గుర్తుల్లో ఉండే అక్షరాల పరిమాణాన్ని కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్ణయించాలని సుప్రీంకోర్టు సూచించింది.

కొనుగోలు చేసే సమయంలో లేదా ఉత్పత్తిని ఉపయోగించే సమయంలో సాధారణ పరిస్థితుల్లోనూ హెచ్చరికలు స్పష్టంగా కనిపించేలా, సులభంగా చదవగలిగేలా ఉండాలని పేర్కొంది.

ఈ చర్యల ద్వారా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో ఉండే అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు గురించి వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాచారం అందనుంది.

ADVERTISEMENT