
PM Modi : బీజేపీ అగ్రనేత, గురువు అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ఉప ప్రధాన మంత్రి, మాజీ బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ 96వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేత ఎల్.కే అద్వానీని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు.
అద్వానీ భారతదేశాన్ని బలోపేతం చేసిన వెలుగని మోదీ అభివర్ణించారు. అద్వానీ దార్శనికత, నాయకత్వం, జాతీయ ప్రగతిని, ఐక్యతను పెంపొందించిందని కొనియాడారు.
అద్వానీ మరింత దీర్ఘాయుష్షు పొందాలని మోదీ ఆకాంక్షించారు. నిర్విరామ కృషితో బీజేపీని బలోపేతం చేశారన్నారు.
బీజేపీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి వచ్చే వరకు ఎనలేని కృషి చేశారని, కాషాయ కార్యకర్తలకు ఇదే స్ఫూర్తినిచ్చిందని కీర్తించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అద్వానీ ఇంటికి వెళ్లిన మోదీ,రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా
#WATCH | Delhi | Prime Minister Narendra Modi met and extended birthday greetings to veteran BJP leader LK Advani at his residence today. pic.twitter.com/eog1N9KpuR
— ANI (@ANI) November 8, 2023