Page Loader
AE ACB Trap: ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ; డబ్బులు పొలాల్లో విసిరేసి పరుగో పరుగు 
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ; డబ్బులు పొలాల్లో విసిరేసి పరుగో పరుగు

AE ACB Trap: ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ; డబ్బులు పొలాల్లో విసిరేసి పరుగో పరుగు 

వ్రాసిన వారు Stalin
Aug 28, 2023
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకీ చిక్కాడు. ఆ తర్వాత అధికారులు అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, కారుతో ఏసీబీ సీఐని ఢీకొట్టాడు. అంతేకాకుండా లంచంగా తీసుకున్న సొమ్మును పొలాల్లో విసిరేసి పరుగులు తీశాడు. ఆంధ్రప్రదేశ్‌, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ములక్కాయవలసలో జరిగింది. ములక్కాయవలస గ్రామానికి చెందిన చెందిన ఈశ్వరరావు అనే రైతు తన పొలానికి విద్యుత్ కనెక్షన్‌ కోసం ఏఈ శాంతారావు దగ్గరకు వెళ్లాడు. విద్యుత్ కనెక్షన్‌ ఇవ్వడానికి ఏఈ రూ.60 వేలు లంచం అడిగాడు. దీంతో రైతు రూ.20వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. మిగిలిన మొత్తం కోసం ఏఈ రైతుపై ఒత్తిడి తేగా, అతను ఏసీబీని ఆశ్రయించాడు.

విద్యుత్

ఏఈ లొంగిపోవాలి, లేకుంటే తీవ్ర పరిణామాలు: ఏసీబీ

ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పన్నిన వలలో ఏఈ చిక్కాడు. విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వడం పూర్తయ్యాక, మిగిలిన రూ.40వేలు పొలం దగ్గర ఇస్తానని రైతు నమ్మబలికాడు. దీంతో రైతు మాటలను నమ్మిన ఏఈ రాత్రి పొలం దగ్గరకు వచ్చాడు. రైతును తన కారులోకి పిలిచిన ఏఈ రూ.40వేల లంచం సొమ్మును తీసుకున్నాడు. ఈ వ్యవహారమంతా ఏసీబీ అధికారులు దూరం నుంచి గమనిస్తున్నారు. ఏఈ డబ్బు తీసుకున్న తర్వాత, ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, సీఐ టి.శ్రీనివాసరావు బైక్‌పై ఏఈ కారు వద్దకు వచ్చారు. ఇది గమనించిన ఏఈ తన కారును ఏసీబీ సీఐకి డీకొట్టి.. పొలాల్లోకి వేగంగా నడిపాడు. అనంతరం పరుగెత్తాడు. శాంతారావు స్వచ్ఛందంగా లొంగిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.