Kolkata : ట్రైనీ డాక్టర్ హత్య.. మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ తొలగింపు
పశ్చిమ బెంగాల్‌లోని మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, అపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఆర్‌జి కర్ ఆస్పత్రిలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యువతిని హత్య చేయడానికి ముందు ఆమెపై ఆత్యాచారం జరిగిందని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్‌ని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ తెలిపింది.
క్యాంపస్ లో భద్రత పెంచాలి
చాలా కాలంగా ఆసుపత్రికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ తొలగించి, అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ను నియమించారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడి పోలీసులు అరెస్టు చేశారు. అతనికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. కళాశాలలో వైద్య విద్యార్థులు, వైద్యులు ఈ ఘటనపై నిరసనలు చేస్తున్నారు. క్యాంపస్‌లో భద్రతా చర్యలను పెంచాలని పదేపదే చెబుతున్న తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితుడికి ఉరిశిక్ష వేస్తామని పేర్కొంది.