Ram temple: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ
Ram temple 'Pran Pratishtha': ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని రామమందిరంలో 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రాణ ప్రతిష్ట అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన 11 రోజుల నిరాహార దీక్షను విరమించారు. ప్రధాని మోదీకి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తీర్ధాన్ని అందజేసి.. ఉపవాసాన్ని విరమింపజేశారు. కఠినమైన ఉపవాస దీక్ష చేసిన మోదీని గోవింద్ దేవ్ గిరి మహారాజ్ అభినందించారు. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో జనవరి 12 నుంచి 22వ తేదీ వరకు 11 రోజుల ఉపవాస దీక్షను ప్రారంభిస్తున్నట్లు తొలిరోజే ప్రధాని మోదీ ప్రకటించారు. సంప్రోక్షణ సమయంలో దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకే దేవుడు తనను సృష్టించినట్లు మోదీ వెల్లడించారు.