భార్య, మేనల్లుడిని కాల్చి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్న అమరావతి ఏసీపీ
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని పూణే నగరంలో దారుణం జరిగింది. 57 ఏళ్ల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) భరత్ గైక్వాడ్ తన భార్య, మేనల్లుడిని కాల్చి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పుణేలోని బనేర్ ప్రాంతంలోని ఏసీపీ భరత్ గైక్వాడ్ నివాసంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని చతుర్‌శ్రింగి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
ప్రస్తుతం భరత్ గైక్వాడ్ అమరావతి ఏసీపీగా పని చేస్తున్నారు.
పుణే
మొదట భార్యపై, తర్వాత మేనల్లుడిపై కాల్పులు
ఏసీపీ గైక్వాడ్ తొలుత తన భార్య తలపై కాల్చి చంపాడని ఓ అధికారి తెలిపారు.
తుపాకీ పేలిన శబ్ధం విని కొడుకు, మేనల్లుడు పరుగున వచ్చి గది తలుపు తీశారు. ఆ తర్వాత అతని మేనల్లుడిపై ఏసీపీ కాల్పులు జరిపారు.
అనంతరం గైక్వాడ్ తన తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.
ఏసీపీతో పాటు అతని భార్య మోని గైక్వాడ్ (44), మేనల్లుడు దీపక్ (35) మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.