Hit And Run Law : హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంపై దేశ వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో ట్రక్కర్ల సంఘ చర్చలు సఫలం కావడంతో ట్రక్కు డ్రైవర్లు సమ్మెను విరమించారు. కేంద్ర ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆల్-ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆందోళన విరమించింది. కొత్త హిట్ అండ్ రన్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత డ్రైవర్లు విధులు చేరాలని ట్రక్కర్లు కోరారు. తాము ఇంకా కొత్త చట్టాలన్ని అమలు చేయలేదని, పదేళ్ల శిక్ష, జరిమానాను తాత్కలికంగా నిలివేసినట్లు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా చెప్పారు.
కొత్త చట్టంపై డ్రైవర్ల ఆందోళన
దీంతో హిట్ అండ్ రన్ చట్టంలోని కొత్త శిక్షాస్మృతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను ఉపసంహరించుకుంటామని ట్రక్కర్స్ అసోసియేషన్ తెలిపింది. కొత్త చట్టం ప్రకారం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఒక వేళ పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతే కాకుండా రూ.7లక్షల జరిమానా పడే అవకాశం ఉంది. ఇలాంటి కేసులు సెక్షన్ 304ఏ కిందకు వస్తాయి. ఇక కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్ష ఎక్కువ కాలం ఉండటంతో పాటు జరిమానా భారీగా ఉండటంపై డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.