Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్
ఈ వార్తాకథనం ఏంటి
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
చండీగఢ్ కొత్త మేయర్ మనోజ్ సోంకర్ ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనున్న నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
మనోజ్ సోంకర్ తన రాజీనామాను కార్పొరేషన్ కమిషనర్‌కు సమర్పించినట్లు బీజేపీ చండీగఢ్ యూనిట్ చీఫ్ జతీందర్ పాల్ మల్హోత్రా తెలిపారు.
అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నంబర్ గేమ్ మారి.. మళ్లీ బీజేపీ అనుకూలంగా మారిన పరిస్థితి నెలకొంది.
35మంది సభ్యులున్న కార్పొరేషన్‌లో బీజేపీకి 14మంది కౌన్సిలర్లు, ఆప్‌కి 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
ఇప్పుడు ముగ్గురు ఆప్ నుంచి ముగ్గురు బీజేపీలోకి చేరడంతో పరిణామాలు మారిపోయాయి.
బీజేపీ
రిటర్నింగ్ అధికారి రిగ్గింగ్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌పై వచ్చిన ఆరోపణలను సోమవారం (ఫిబ్రవరి 19) సుప్రీంకోర్టు విచారించనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూటమి నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కుల్దీప్ కుమార్ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
ఓటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ మోసానికి పాల్పడ్డారని కులదీప్ కుమార్ పిటిషన్ దాఖలుకు చేశారు. దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించారు.