Page Loader
Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్శకుడు మిస్సింగ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్శకుడు మిస్సింగ్

Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దర్శకుడు మిస్సింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జూన్ 12న మధ్యాహ్నం లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 270 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇదే సమయంలో ప్రముఖ మ్యూజిక్ ఆల్బమ్స్ దర్శకుడు మహేశ్ జీరావాలా ఆ రోజు నుంచి అదృశ్యమవడం, అతని కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రమాదం జరిగిన రోజు మహేశ్‌ అహ్మదాబాద్‌లోని నీలా గార్డెన్‌ వద్ద ఓ వ్యక్తిని కలవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. "ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసి మీటింగ్ అయిపోయిందని, ఇంటికి బయలుదేరుతున్నానని చెప్పాడు.

Details

కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాల సేకరణ

కానీ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని మహేశ్ భార్య హేతల్ భావోద్వేగంతో చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించగా, ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో మహేశ్ మొబైల్ ఫోన్ లొకేషన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతను కూడా ఈ విమాన ప్రమాదంలో మృతి చెందాడేమోననే అనుమానంతో పోలీసులు అతని కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. మహేశ్ సాధారణంగా ఆ మార్గంలో ప్రయాణించడు. కానీ ఆ రోజు ఏదో కారణంగా ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది ఎంతో బాధాకరం" అని హేతల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.