కన్నడ మీడియాలోకి ఏఐ యాంకర్ సౌందర్య ఎంట్రీ!
రోజు రోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుకుంది. టెలివిజన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఎన్నో సంచనాలను సష్టిస్తోంది. ఇటీవల ఒడిశాకు చెందిన ఓ మీడియాలో ఛానల్ ఏఐ యాంకర్‌తో వార్తలు చదివించింది. ప్రస్తుతం కన్నడ మీడియాలోకి ఏఐ యాంకర్ సౌందర్య ఎంట్రీ ఇచ్చింది. ఈ సౌందర్య అచ్చం నిజమైన యాంకర్ లాగానే వార్తలు చదువుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు మీడియా ఛానల్స్ ఏఐ యాంకర్స్ తో వార్తలు చదివిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మరింత నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
టెలివిజన్ రంగంలో ఏఐ యాంకర్ల ట్రెండ్
కర్నాటకలో సౌందర్య అనే ఏఐ యాంకర్‌తో పవర్ టీవీ వార్తలను ప్రసారం చేసేందుకు ప్రయత్నించింది. 'హలో కన్నడిగులు, పవర్ టీవీకి స్వాగతం. నేను సౌందర్య సౌత్ ఇండియాలో మొట్టమొదటి ఏఐ న్యూస్ యాంకర్' అంటూ వార్తలను చదవడం ప్రారంభించింది. ఈ ఏఐ యాంకర్ తరుచుగా కనురెప్పలను ఆడిస్తూ, కొన్ని ముఖ కవళికలతో వార్తలను చదవడం అందరిని అబ్బురపరిచింది. మైక్రోసాఫ్ట్, IBM, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు ఏఐ వచ్చాక కొంతమంది ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది అమెరికాలో జరిగిన లేఆఫ్‌లకు 5శాతం వరకూ AI కారణమని తెలుస్తోంది. ప్రస్తుతానికి AI యాంకర్ల ట్రెండ్ మాత్రం గట్టిగానే నడుస్తోంది.