AI Impact Summit :'క్యాబ్ లేదు.. మెట్రో లేదు'.. భారత్ మండపం వద్ద ట్రాన్స్‌పోర్ట్ కష్టాలు.. సోషల్ మీడియాలో విమర్శల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మూడో రోజు భారత్ మండపం వద్ద భారీ రద్దీ, రవాణా గందరగోళం కారణంగా పాల్గొన్నవారికి తీవ్ర అసౌకర్యం కలిగింది. భారత్ మండపం బయట రహదారులపై వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో క్యాబ్‌లు అందుబాటులో లేక పలువురు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని వారు తెలిపారు. కార్యక్రమం ముగిసే సమయానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్వహణలో లోపాలున్నాయని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా భారత్‌లో నివసిస్తున్నకెనడాకు చెందిన కాలెబ్ ఫ్రీసెన్ సమ్మిట్ అనుభవం బాగానే ఉన్నప్పటికీ సాయంత్రం 7:40 గంటల సమయంలో బయటకు రాగానే క్యాబ్‌లు, షటిల్ సర్వీసులు ఎక్కడా కనిపించలేదని ఎక్స్‌లో పోస్టు చేశారు.
వివరాలు
రోడ్లు బ్లాక్.. మెట్రో స్టేషన్ క్లోజ్.. క్యాబ్‌లకు నో ఎంట్రీపై ఆగ్రహం!
ఇదే విషయంపై కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ కూడా స్పందిస్తూ, రోడ్లు బ్లాక్ చేయడంతో పాటు సమీప మెట్రో స్టేషన్‌ను కూడా తాత్కాలికంగా మూసివేశారని తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన తన బంధువు రాత్రి 8 గంటల నుంచి క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నా దొరకలేదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ముందుగా సమ్మిట్ అధికారిక పేజీలో రద్దీని నివారించేందుకు క్యాబ్‌లలో రావాలని సూచించినప్పటికీ, ప్రాంగణం సమీపంలో క్యాబ్‌లకు అనుమతి నిరాకరించడంపై పాల్గొన్నవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దీపికా నారాయణ్ భరద్వాజ్ చేసిన ట్వీట్
Cousin from US is attending #AISummit
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) February 18, 2026
Has been trying to book a cab since 8pm to come home. No luck yet
Roads blocked. Cops not allowing Cabs. Near by Metro station closed.
How are people even commuting?
వివరాలు
వీఐపీ రాక నేపథ్యంలో..
కొందరు వినియోగదారులు షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీఐపీ రాక నేపథ్యంలో ఒక్కసారిగా గేట్లు, రోడ్లు మూసివేయడంతో సాయంత్రం 6 గంటల నుంచే ప్రజలు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, చెక్‌పాయింట్ల వద్ద పోలీసులు కూడా "రోడ్లు బ్లాక్ అయ్యాయి" అంటూ అదే సమాధానం ఇస్తున్నారని ఒకరు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద భారీ స్థాయి సమావేశం అయినప్పటికీ, బయట ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల చివరి రోజున పాల్గొన్నవారికి చేదు అనుభవం మిగిలిందని వారు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
క్యాబ్ కోసం దాదాపుగా 5కీ.మీ నడిచి వెళ్ళానంటున్న సాహిల్ రాజపుత్
Walked almost 5kms to just get a cab.
— Sahil Rajput (@_sahilrajput) February 18, 2026
Govt has blocked all the gates and road and asking people to walk just because some VIP is coming.
People are walking since 6pm and at all check points police is saying this is blocked.
India AI Impact Summit 2026 - The
management is such… pic.twitter.com/O8yfWJv2Z7