LOADING...
AI Summit 2026 : దిల్లీ వేదికగా ఏఐ మహాసదస్సు: ప్రపంచ టెక్ దిగ్గజాల సందడి.. షెడ్యూల్​ వివరాలు..
షెడ్యూల్​ వివరాలు..

AI Summit 2026 : దిల్లీ వేదికగా ఏఐ మహాసదస్సు: ప్రపంచ టెక్ దిగ్గజాల సందడి.. షెడ్యూల్​ వివరాలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచ స్థాయి నేతగా ఎదగడంపై స్పష్టమైన దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సు 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' నేడు (ఫిబ్రవరి 16, సోమవారం) న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా ఘనంగా ఆరంభం కానుంది. ఫిబ్రవరి 20 వరకు ఐదు రోజుల పాటు కొనసాగే ఈ మహాసదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సాంకేతిక నిపుణులు, టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకానున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాలు 

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 - రిజిస్ట్రేషన్ విధానం

ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రత్యక్షంగా హాజరుకావాలనుకునే వారు డెలిగేట్గా ముందుగా నమోదు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థి డిజిటల్ ఫోటోను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. ఈమెయిల్ ధృవీకరణ కోసం ఓటీపీ ప్రక్రియను పూర్తి చేయాలి. నమోదు పూర్తైన తర్వాత మీ ఈమెయిల్‌కు క్యూఆర్ కోడ్ పంపిస్తారు. ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది దీనిని స్కాన్ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తారు. ముఖ్య గమనిక: ఫిబ్రవరి 19న ప్రధాని పాల్గొనే రోజున భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రత్యేక సెషన్లకు డెలిగేట్లకు ప్రవేశం ఉండదు.

వివరాలు 

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఐదు రోజుల పూర్తి షెడ్యూల్..

అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ సదస్సు ఐదు రోజుల పాటు ఈ విధంగా కొనసాగనుంది: ఫిబ్రవరి 16 (సోమవారం): ప్రారంభ రోజున కీలక ప్రసంగాలు, ఏఐ విధానాలపై ప్యానెల్ చర్చలు, నిపుణుల రౌండ్‌టేబుల్ సమావేశాలు జరుగుతాయి. అదే రోజున 'ఇండియా ఏఐ ఎక్స్‌పో'ను ప్రారంభిస్తారు. దేశీయ అవసరాలు, భారత ఏఐ వ్యూహాలపై ప్రాథమిక చర్చలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 17 (మంగళవారం): ఆరోగ్యం, ఇంధనం, విద్య, వ్యవసాయం, లింగ సాధికారత, వైకల్యాల నివారణ వంటి ప్రాధాన్యత కలిగిన రంగాల్లో ఏఐ వినియోగంపై లోతైన చర్చలు కొనసాగుతాయి. ప్రభుత్వం రూపొందించిన ఫ్లాగ్‌షిప్ 'నాలెడ్జ్ కాంపెండియా'ను ఈ రోజు ఆవిష్కరించనున్నారు.

Advertisement

వివరాలు 

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఐదు రోజుల పూర్తి షెడ్యూల్..

ఫిబ్రవరి 18 (బుధవారం): మూడో రోజు పరిశోధన, ఆచరణాత్మక అనువర్తనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. రీసెర్చ్ సింపోజియం, గ్లోబల్ టెక్ లీడర్లు, స్టార్టప్‌లు తమ వినూత్న పరిష్కారాలను ప్రదర్శించే ఇండస్ట్రీ సెషన్లు జరుగుతాయి. ఫిబ్రవరి 19 (గురువారం): సదస్సులో అత్యంత కీలకమైన ఈ రోజున ప్రధాన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అనంతరం గ్లోబల్ సీఈఓలు, ఇన్వెస్టర్లు, విధానకర్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి బాధ్యతాయుతమైన ఏఐ, పెట్టుబడి అవకాశాలపై చర్చిస్తారు. ఫిబ్రవరి 20 (శుక్రవారం): ముగింపు రోజున గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జీపీఏఐ) సభ్యుల కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధికి అవసరమైన సహకారంపై తుది నిర్ణయాలు తీసుకుంటారు.

Advertisement

వివరాలు 

ఏఐ ఇంపాక్ట్​ సమిట్​ 2026- అతిరథ మహారథులు వీరే!

ఈ సదస్సులో సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్‌తో పాటు టెక్ ప్రపంచానికి చెందిన మరెందరో ప్రముఖులు పాల్గొననున్నారు. వారిలో ముఖ్యులు: డెమిస్ హసాబిస్ - గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ ముకేశ్ అంబానీ - రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత సలీల్ పరేఖ్ - ఇన్ఫోసిస్ సీఈఓ క్రిస్టియానో అమోన్ - క్వాల్‌కామ్ ప్రెసిడెంట్ & సీఈఓ కే కృతివాసన్ -టీసీఎస్ సీఈఓ జూలీ స్వీట్ -అక్సెంచర్ చైర్ & సీఈఓ డారియో అమోడెయ్ -ఆంత్రోపిక్ సీఈఓ సునీల్ భారతి మిట్టల్ -భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్ -మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అయితే, ఎన్వీడియా వ్యవస్థాపకుడు,సీఈఓ జెన్సన్ హువాంగ్ అనివార్య కారణాల వల్ల ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement