Weather: అండమాన్ సమీపంలో వాయుగుండం.. కోస్తాంధ్ర,రాయలసీమలో వర్షాలు పడే అవకాశాలు
ఈ వార్తాకథనం ఏంటి
మలక్కా జలసంధి పరిసరాల్లో,దక్షిణ అండమాన్‌కు ఆనుకుని ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మెల్లగా ముందుకు సాగుతూ,రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మధ్యస్థ స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో, వ్యవసాయ కార్యకలాపాల్లో రైతులు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే, గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వేట కోసం సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరాలని కూడా సూచించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం
మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 25, 2025
ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది.#Depression #AndhraPradesh #APSDMA #weather #WeatherUpdate pic.twitter.com/tLjUBk0prb