
Amar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ సమావేశమయ్యారు.
ఈ భేటీ న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో జరిగింది. ప్రస్తుత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ భేటీకి కీలక ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సమావేశానికి ముందు రోజు నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠీ కూడా ప్రధాని మోదీని కలిసి భేటీ కావడం గమనార్హం.
ఇక పహల్గాం ఉగ్రదాడి అనంతరం భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమై, ఉగ్రవాదులపై త్రివిధ దళాలకు సమగ్ర చర్యల స్వేచ్ఛను ఇచ్చింది.
దాడుల లక్ష్యాలు, టైమింగ్‌ను దళాలే నిర్ణయించుకోవచ్చని సీసీఎస్ ప్రకటించింది.
Details
గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్
భద్రతా సన్నద్ధతలో భాగంగా, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలను నిర్వహించి తన సమర్థతను ప్రదర్శించింది.
గతంలో 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాక్‌లోకి ప్రవేశించి ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
అప్పటి కంటే ప్రస్తుతం వాయుసేన శక్తి రఫెల్ యుద్ధ విమానాలు, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో మరింత బలపడినదిగా భావిస్తున్నారు.