1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్
బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని కొచ్చి విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ గురువారం తెలిపింది. వాయనాడ్‌కు చెందిన షఫీ అనే వ్యక్తిని 1,487 గ్రాముల బంగారంతో కొచ్చిలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బహ్రెయిన్-కోజికోడ్-కొచ్చి సర్వీసులో క్యాబిన్ సిబ్బంది షఫీ బంగారం తీసుకువస్తున్నట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్‌కు రహస్య సమాచారం అందింది. బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలనుకున్న షఫీని పక్కా సమాచారంతో అధికారులు పెట్టుకున్నారు. అతడిని మరింత లోతుగా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చెన్నై విమానాశ్రయంలో 6.8 కిలోల బంగారం స్వాధీనం
సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి బుధవారం చెన్నై విమానాశ్రయంలో 6.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, వాటి విలువ రూ.3.32 కోట్లు అని చెన్నై కస్టమ్స్ తెలిపింది. ప్రయాణికులు సింగపూర్ నుంచి ఏఐ-347, 6ఈ-52 ద్వారా ఆ ప్రయాణికులు చెన్నై చేరుకున్నారు. వారి సామాన్లను తనిఖీ చేయగా, వారి వద్ద బంగారం లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్పారు.