Air India: ఇంధన ధరల భారం.. దేశీయ విమానాల సంఖ్యను 22% వరకు తగ్గించిన ఎయిర్ ఇండియా
ఈ వార్తాకథనం ఏంటి
ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నుంచి ఆగస్టు 2026 వరకు కొన్ని దేశీయ విమాన మార్గాల్లో సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆపరేషనల్ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా.. జూన్ నుంచి ఆగస్టు 2026 మధ్య కొన్ని అంతర్జాతీయ విమానసర్వీసులను ఇప్పటికే తగ్గించినట్లు గుర్తు చేసింది. ఇప్పుడు అదేప్రభావం దేశీయ రూట్లపైనా పడిందని వెల్లడించింది. "జూన్ నుంచి ఆగస్టు 2026 మధ్య కొన్ని అంతర్జాతీయ సర్వీసుల్లో చేసిన మార్పుల కొనసాగింపుగా, కొన్ని దేశీయ మార్గాల్లో కూడా విమానాల ఫ్రీక్వెన్సీని తాత్కాలికంగా తగ్గించాం"అని ఎయిర్ ఇండియా పేర్కొంది.
వివరాలు
20-22 శాతం వరకు కోత
పీటీఐ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎయిర్ ఇండియా దేశీయ విమాన సర్వీసుల్లో సుమారు 20నుంచి 22శాతం వరకు కోత విధించే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ సర్వీసుల్లో ఇప్పటికే దాదాపు 27శాతం వరకు తగ్గింపు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రతి వారం సుమారు 4,400విమాన సర్వీసులు నిర్వహిస్తోంది.ఇందులో 3,600దేశీయ సర్వీసులు కాగా,మరో 800అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. ఇంధన ధరల ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున ఈతాత్కాలిక మార్పులు అవసరమయ్యాయని సంస్థ తెలిపింది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మళ్లీ విమానాల సంఖ్య పెంచే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది. అలాగే ప్రభావిత ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన సౌకర్యం,ఉచితంగా తేదీ మార్పు లేదా పూర్తి రీఫండ్ అందిస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.