Air India Express: బ్రీత్ టెస్ట్‌కు ఆలస్యంగా హాజరు.. 8 మంది ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్లపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
నిర్ణీత సమయంలో బ్రీత్ టెస్ట్‌కు హాజరుకాకపోవడంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 8 మంది పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసింది. మూడు నెలల పాటు విధుల నుంచి తొలగించింది. దుబాయ్-అమృత్‌సర్ విమానంలో పనిచేసిన సిబ్బంది ఈ నిబంధనను ఉల్లంఘించినట్లు తెలిసింది. 35 నిమిషాల ఆలస్యం దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన సిబ్బంది.. శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైన తర్వాత రెండు గంటల్లోపు పోస్ట్-ఫ్లైట్ డిక్లరేషన్‌కు హాజరు కావాల్సి ఉంది. అయితే వారు నిర్ణీత గడువును పాటించకుండా 35 నిమిషాల ఆలస్యంగా బ్రీత్ అనలైజర్ పరీక్షకు హాజరయ్యారు.
వివరాలు
ఆల్కహాల్ పరీక్షలో నెగెటివ్ వచ్చినా..
ఈ ఘటనను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.. విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దృష్టికి తీసుకెళ్లింది.
అనంతరం సంబంధిత పైలట్లకు నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షలో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది.
అయినప్పటికీ, నిర్ణీత నిబంధనలను ఉల్లంఘించినందుకు సంస్థ 8 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది.
ఫుకెట్-దిల్లీ విమాన ఘటన నేపథ్యంలో..
ఇటీవల ఫుకెట్-దిల్లీ విమాన ఘటనలో పైలట్-ఇన్-కమాండ్ గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్టులో వెల్లడైన విషయం తెలిసిందే.
ఈ పరిణామం నేపథ్యంలో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లందరికీ డోప్ టెస్టును తప్పనిసరి చేశారు.