Air India: భారతీయ విద్యార్థిని సూట్ కేసు ఆచూకీపై సందిగ్దత.. ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్వాకం
ఎయిర్ ఇండియా విమానంలో తన లగేజీ కనిపించకుండా పోవడంతో అమెరికాలోని ఓ భారతీయ విద్యార్థిని పూజా కథైల్ షాక్ కు గురైంది. మరుసటి రోజు వివాహానికి హాజరుకావాల్సి వుంది. దీనితో విమానయాన పరిశ్రమలో సామాను నిర్వహణ ,కస్టమర్ సేవ, లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఆ సంస్ధ విశ్వసనీయతపై పెరుగుతున్న ఆందోళనకు ఆమె ట్వీట్ మరింత ఊతం కల్పించింది. UC బర్కిలీలో కంప్యూటేషనల్ బయాలజీలో పీహెచ్‌డీ విద్యార్థిని అయిన కథైల్, శాన్ ఫ్రాన్సిస్కో నుండి బెంగుళూరుకు ఎయిర్ ఇండియాలో వచ్చారు. అయితే ఆమె ప్రయాణించిన విమానంలో తన లగేజీని కూడా లోడ్ చేయలేదని తెలిసి ఖంగు తిన్నారు.
కస్టమర్ సర్వీస్ వృధా
ఎయిర్ ఇండియా కస్టమర్ సర్వీస్‌ను చేరుకోవడానికి ఆమె చాలా కష్టపడ్డారు. కానీ వారి ఇచ్చిన సమాధానంతో ఆమె సంతృప్తి చెందలేదు. తన సూట్‌కేస్‌ను విమానంలో ఎక్కించలేదని నిరాశ చెందిన కథైల్ తన , అసంతృప్తిని X లో వెలిబుచ్చారు. "నిన్న శాన్ ఫ్రాన్సిస్కో, బెంగళూరు డైరెక్ట్ ఫ్లైట్ తీసుకున్నాను. ఎయిర్ ఇండియా నా సూట్‌కేస్‌ను విమానంలో ఎక్కించలేదు. 36 గంటలు గడిచింది. ఇంకా డెలివరీ ఎప్పుడు చేస్తారో ఎవరూ చెప్పడం లేదు. వారికి 40 సార్లు ఫోన్ చేశాను. రేపు వెళ్లాల్సిన పెళ్లికి, బట్టలు లేవు" అని ట్వీట్ చేశారు.