Page Loader
ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్‌ పిట్‌లోకి పైలట్ గర్ల్‌ ఫ్రెండ్‌‌.. 30 లక్షల ఫైన్
ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్‌ పిట్‌లోకి పైలట్ గర్ల్‌ ఫ్రెండ్‌‌..30 లక్షల ఫైన్

ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్‌ పిట్‌లోకి పైలట్ గర్ల్‌ ఫ్రెండ్‌‌.. 30 లక్షల ఫైన్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 13, 2023
05:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమానం ఎక్కిన ప్రయాణికుల్లో ఆ ఫ్లైట్ పైలట్ లవర్ కూడా ఉంది. అయితే తాను నడిపే విమానంలో తన ప్రేయసి ఉండటంతో పైలట్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈ మేరకు అత్యుత్సాహం ప్రదర్శించి, ఏకంగా గర్ల్ ఫ్రెండ్ ను విమానంలోని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 27న దుబాయ్ - దిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, ప్రస్తుతం తీవ్ర దుమారమే రేపుతోంది. దీంతో సదరు పైలెట్ లైసెన్స్‌ను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఎయిరిండియాకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా సైతం విధించింది.

DETAILS

ఘటనపై సీరియస్ అయిన ఎయిర్ ఇండియా సంస్థ

తాజాగా ఇలాంటి ఘటనే దిల్లీ - లేహ్ ఎయిర్ ఇండియా విమానంలో గతవారం జరిగింది. ఓ మహిళను పైలట్, కో-పైలట్‌ కాక్‌పీట్‌లోకి తీసుకెళ్లారు. AI-445 దిల్లీ - లేహ్ విమానం కాక్‌ పిట్‌లోకి ఓ మహిళ ప్యాసింజర్ అనధికారికంగా ప్రవేశించారని క్యాబిన్ సిబ్బంది సంస్థకు ఫిర్యాదు చేసింది. స్పందించిన యాజమాన్యం విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఇద్దరిని విధుల నుంచి తప్పించింది. లేహ్ దేశంలోనే అత్యంత కష్టతరమైన, సున్నితమైన విమాన మార్గమని ఎయిరిండియా అధికారొకరు చెప్పారు. కమర్షియల్ ఫ్లైట్ కాక్‌పిట్‌లోకి అనధికార వ్యక్తికి అనుమతివ్వడం అంటే చట్టాలను ఉల్లంఘించినట్లేనన్నారు. మరోవైపు ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.సమగ్ర దర్యాప్తునకు సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇప్పటికే కమిటీ వేసిందని వివరించింది.