
CSTEP : 76 భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగే అవకాశం.. హెచ్చరికలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని 76 నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ నిర్వహించిన తాజా అధ్యయనం కొన్ని కీలక విషయాలను వెలుగులోకి వచ్చాయి.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ నిర్దేశించిన లక్ష్యాలను రాబోయే కాలంలో కొద్ది నగరాలు మాత్రమే చేరుకోవచ్చని ఈ అధ్యయనం నివేదించింది.
2019లో ప్రారంభమైన NCAP, 131 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది.
2030 నాటికి కేవలం ఎనిమిది నగరాలు మాత్రమే ఉద్గారాలను 40 శాతం తగ్గించగలవని సూచించింది.
Details
సరైన ప్రణాళికలు చేపట్టాలి
2019తో పోలిస్తే 2030 నాటికి కొన్ని నగరాల్లో ఉద్గారాలు 11 నుంచి 45 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
70 శాతం కంటే ఎక్కువ నగరాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి సరైన ప్రణాళికలు లేకపోతే, అత్యంత హానికరమైన పీఎం 2.5 కాలుష్య కారకం పెరుగుతుందని చెప్పింది.
వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పరిశ్రమలు, రవాణా, నిర్మాణం, వ్యర్థాల బహిరంగ కాల్చివేత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరమని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ స్పష్టం చేసింది.