Page Loader
Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌
Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌

Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌

వ్రాసిన వారు Stalin
Jan 08, 2024
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సవరించిన మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై సీనియర్ అధికారులు, నిపుణులతో మేథోమధన సదస్సు జరిగింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (HAML) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో సవరించిన ప్రతిపాదనలపై చర్చించారు. ప్రతిపాదిత నూతన మార్గాల్లో సవాళ్లపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్ కోసం రెండు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అందులో నాగోల్‌-ఎల్బీనగర్‌- మైలార్‌దేవ్‌పల్లి-శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఒక ప్రతిపాదన. నాగోల్‌-ఎల్బీనగర్‌-మైలార్‌దేవ్‌పల్లి-ఆరాంఘర్‌-కొత్త హైకోర్టు అనుసంధానంగా మరో మార్గాన్ని నిపుణులు ప్రతిపాదించారు. ఈ మార్గాల్లో సాధ్యాసాధ్యాలపై చర్చించారు.

మెట్రో

మరో కి.మీన్నర లైన్‌ను పొడిగించి చాంద్రాయణగుట్టకు కనెక్టివిటీ

MGBS-ఫలక్‌నుమా లైన్‌ను నాగోల్-ఎల్‌బీ నగర్-మైలార్‌దేవ్‌పల్లి-ఎయిర్‌పోర్ట్ లైన్‌లో మరో కి.మీన్నర పొడిగించి చాంద్రాయణగుట్టకు కలపడంపై కూడా నిపుణులు చర్చించారు. ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌గా చాంద్రాయణగుట్టను అభివృద్ధి చేయడం ద్వారా పాతబస్తీకి కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారు. చాంద్రాయణగుట్టలో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌ ఏర్పాటు చేయడం అంత సులువైన పని కాదు. ఈ ప్రాంతంలో ఇరుకైన రహదారి, ఇప్పటికే ఫ్లైఓవర్ ఉండటంతో పాటు రైలు రివర్సల్, స్టెబిలింగ్ లైన్లను ఏర్పాటులో అనేక సంక్లిష్టతలు ఉన్నాయి. ఈ క్రమంలో చాంద్రాయణగుట్టలో ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌ ఏర్పాటు కోసం సాంకేతిక పరిష్కారాలపై అధికారులు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.