Page Loader
BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి 
BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి

BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి 

వ్రాసిన వారు Stalin
Dec 10, 2023
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు. లక్నోలో జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆకాష్ ఆనంద్ లండన్‌లో ఎంబీఏ చేసారు. 6 సంవత్సరాల క్రితం అంటే 2017 లో సహరాన్‌పూర్‌లో జరిగిన సభ ద్వారా ఆనంద్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆనంద్ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు. ఆనంద్‌ను మాయావతి తన వారసుడిగా ప్రకటించవచ్చని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్లుగా ఆమె ప్రకటించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో బీఎస్పీ ఓటమి తర్వాత మాయావతి ఆనంద్‌ను పార్టీలో ప్రోత్సహించడం ప్రారంభించారు. అనంతరం అతనికి పార్టీలో ముఖ్యమైన పదవులను కేటాయించారు. అనేక ఎన్నికల రాష్ట్రాలను కూడా అప్పజెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రస్తుతం బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా ఉన్న ఆనంద్