Page Loader
Akbaruddin Owaisi: విషప్రయోగం చేసి చంపాలని చూస్తున్నారు.. ఏఐఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు
విషప్రయోగం చేసి చంపాలని చూస్తున్నారు.. ఏఐఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు

Akbaruddin Owaisi: విషప్రయోగం చేసి చంపాలని చూస్తున్నారు.. ఏఐఎంఐఎం నేత కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2024
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని యాకుత్‌పురా ప్రాంతంలో సోమవారం జరిగిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఇ-ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎంఐఎం) ఎమ్మెల్యే, అసదుద్దీన్‌ ఒవైసీ తమ్ముడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా అన్నదమ్ములను జైలుకు పంపాలని కొందరు అన్నారన్నారు. జైల్లో మందు పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని చంపేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మేం చాలా బలంగా ఉన్నామని, అందుకే మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారని అన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా మేమే గెలుస్తామని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.

Details 

 ప్రాణహాని ఉందన్న ఒవైసీ అసదుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ ఒవైసీ కంటే ముందు, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా తనకు ప్రాణహాని ఉందని అన్నారు. ఏప్రిల్ 1న గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మరణించిన తర్వాత అయన అన్సారీ కుటుంబాన్ని కలవడానికి వెళ్లాడని, ఆ తర్వాత తనకు హత్య బెదిరింపులు వచ్చాయని చెప్పారు. అయితే, ఈ విషయంలో బెదిరింపు సోషల్ మీడియా పోస్ట్‌లను పర్యవేక్షించాలని అసదుద్దీన్ ఒవైసీ భారత ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.