Loading...
Akvan Cyclone: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తెలంగాణపై కూడా ఎఫెక్ట్.. వాతావరణశాఖ కీలక అప్డేట్!
అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తెలంగాణపై కూడా ఎఫెక్ట్.. వాతావరణశాఖ కీలక అప్డేట్!

Akvan Cyclone: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తెలంగాణపై కూడా ఎఫెక్ట్.. వాతావరణశాఖ కీలక అప్డేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 'అక్వాన్' తుఫానుగా బలపడింది. ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం వాయువ్య-ఉత్తర దిశగా కదిలి నవంబర్ 16న సాయంత్రం 5.30 గంటలకు తుఫానుగా మారింది. దీనికి అక్వాన్ (Akvan)గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 17న ఉదయం 8.30 గంటల నాటికి గత ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా వాయువ్య-ఉత్తర దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఇది 12.2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85.7 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది.

వివరాలు

ప్రధాన నగరాలకు ఎంత దూరంలో ఉందంటే?

ప్రస్తుతం అక్వాన్ తుఫాన్ పలు ప్రాంతాలకు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది.

చెన్నై (తమిళనాడు)కు తూర్పున సుమారు 610 కి.మీ.

ట్రింకోమలీ (శ్రీలంక)కు ఈశాన్యంగా 630 కి.మీ.

మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్)కు ఆగ్నేయంగా 660 కి.మీ.

విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కు దక్షిణ-ఆగ్నేయంగా 670 కి.మీ.

గోపాల్‌పూర్ (ఒడిశా)కు దక్షిణంగా 790 కి.మీ. దూరంలో ఉంది.

వివరాలు

నవంబర్ 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం

అక్వాన్ తుఫాన్ వాయువ్య-ఉత్తర దిశగా కదులుతూ నవంబర్ 17 సాయంత్రం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది.

ఆ తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ నవంబర్ 19 ఉదయం నాటికి అతి తీవ్ర తుఫానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అనంతరం వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ నవంబర్ 20 మధ్యాహ్నం సమయంలో అతి తీవ్ర తుఫానుగా నెల్లూరు, తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉంది.

తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.

ADVERTISEMENT

వివరాలు

తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం

అక్వాన్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఈరోజు, రేపు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది.

వర్షాలు కురిసే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఏపీకి భారీ వర్షసూచన

అక్వాన్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా ఉండనుందని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గతంలో వచ్చిన అర్నబ్ తుఫాన్ తరహాలోనే అక్వాన్ ప్రభావం ఉండవచ్చని పేర్కొంది.

ADVERTISEMENT