Al Falah University: అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ సోదరుడు హైదరాబాదులో అరెస్టు.. 25 ఏళ్ల పాత స్కామ్ వెలుగులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లో 25 ఏళ్ల క్రితం జరిగిన భారీ ఆర్థిక మోసం కేసులో నిందితుడిగా పేరొందిన హమూద్ అహ్మద్ సిద్దిఖీని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు దిల్లీ ఎర్రకోట పేలుడు (Red Fort blast) కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ (Al Falah University) ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ సోదరుడు కావడం గమనార్హం. మహూ ప్రాంతంలో చోటుచేసుకున్న ఆ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి అతడు పరారీలో ఉన్నాడు.
Details
25 ఏళ్ల క్రితం భారీ మోసం
హమూద్ అహ్మద్ సిద్దిఖీ మహూలో నకిలీ ప్రైవేట్ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రజల డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మబలికాడు. వందలాది మందిని ఆకర్షించి భారీగా డిపాజిట్లు సేకరించాడు. మోసం బయటపడిన వెంటనే కుటుంబంతో కలిసి 2000లో మహూ నుండి పారిపోయాడు. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు విశేషంగా గాలిస్తున్నారు. మహూ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లలిత్ సింగ్ సికర్వార్ తెలిపిన వివరాల ప్రకారం, హమూద్ ఆదివారం హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యాడు. అతడు ఇన్నేళ్లుగా లో-ప్రొఫైల్‌లో జీవిస్తూ షేర్ ట్రేడింగ్ చేస్తూ గుర్తింపుపట్టకుండాఉండేవాడు. దిల్లీ ఎర్రకోట పేలుడు కేసు నేపథ్యంలో పోలీసులు జావెద్ సిద్దిఖీ గత చరిత్రను పరిశీలించే ప్రక్రియలోహమూద్‌పై పెండింగ్‌లో ఉన్న ఈ పాత మోసం కేసు తిరిగి బయటపడింది.
Details
యూనివర్సిటీపై పెరుగుతున్న అనుమానాలు - సమన్లు జారీ
అల్ ఫలాహ్ యూనివర్సిటీ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, పరిపాలనా అనుమతులపై సస్పిషన్ ఉన్న నేపథ్యంలో జావెద్ సిద్దిఖీ స్టేట్‌మెంట్ అత్యంత కీలకమని పోలీసులు భావిస్తున్నారు. ఫరీదాబాద్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో భాగంగా, అలాగే యూనివర్సిటీపై నమోదైన ఫోర్జరీ, మోసం కేసుల విచారణ కోసం దిల్లీ పోలీసులు జావెద్ సిద్దిఖీకి రెండు సమన్లు జారీ చేశారు. గత వారం ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించి అనుమానాస్పద వ్యక్తులు అల్ ఫలాహ్ యూనివర్సిటీతో లింక్ ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో, పోలీసుల దృష్టి యూనివర్సిటీ రికార్డులు, దాని ఆర్థిక లావాదేవీలు, అనుమతులపై కేంద్రీకృతమైంది