Page Loader
Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే 
Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్యెల్యే

Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2023
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి షాక్ తగిలింది. ప్రస్తుత అలంపూర్ ఎమ్యెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు అలంపూర్‌కు చెందిన.. నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ తొలుత టికెట్ ఆయనకే ప్రకటించినప్పటికీ.. తర్వాత కీలక నేత చల్లా మనిషి విజయుడికి బీ ఫామ్ ఇవ్వడంతో మనస్థాపం చెందిన అబ్రహం గత కొన్నిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్న అబ్రహం చివరికి కాంగ్రెస్ లో చేరారు.

Details 

అలంపూర్ లో మరింత బలపడిన కాంగ్రెస్ 

తనను నమ్ముకున్న కేడర్ కోసం పార్టీ మారానన్నారు అబ్రహం. అయితే అబ్రహం చేరికతో అలంపూర్ లో కాంగ్రెస్ మరింత బలపడింది. అంతకుముందే మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్ లో చేరగా.. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నడంతో అలంపూర్ లో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరింది. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన అలంపూర్ లో అగ్రకులాల పెత్తనాన్ని అడ్డుకునేందుకు అలంపూర్ అగ్రనేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు.