AP Inter Exams 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు, కొత్త టైమ్‌టేబుల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. గతంలో ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రకటన జారీ చేసింది. తాజా షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.
Details
స్వల్ప మార్పులు ఇలా
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు మొదలవుతాయి. మార్చి 24 నాటికి అన్ని పరీక్షలు పూర్తికానున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్-1 పరీక్షను మార్చి 21కు మార్చారు. అలాగే మార్చి 3న నిర్వహించాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్-2ఏ / సివిక్స్-2 పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నారు. మిగిలిన అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి.
Details
ఏపీ ఇంటర్ 2026 - ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
ఫిబ్రవరి 23: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 ఫిబ్రవరి 25: ఇంగ్లీష్ పేపర్-1 ఫిబ్రవరి 27: హిస్టరీ పేపర్-1 / బోటనీ పేపర్-1 మార్చి 2: మ్యాథ్స్ పేపర్-1, పేపర్-1ఏ మార్చి 5: జూవాలజీ / మ్యాథ్స్-1బి, జూవాలజీ పేపర్-1 మార్చి 7: ఎకనామిక్స్-1 మార్చి 10: ఫిజిక్స్-1 మార్చి 12: కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్-1 మార్చి 14: సివిక్స్-1 మార్చి 17: కెమిస్ట్రీ-1 మార్చి 21: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్-1 మార్చి 24: మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ-1
Details
ఏపీ ఇంటర్ 2026 - సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
ఫిబ్రవరి 24: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 ఫిబ్రవరి 26: ఇంగ్లీష్ పేపర్-2 ఫిబ్రవరి 28: హిస్టరీ / బోటనీ పేపర్-2 మార్చి 4: మ్యాథ్స్ పేపర్-2ఏ / సివిక్స్-2 మార్చి 6: జూవాలజీ-2 / ఎకనామిక్స్-2 మార్చి 9: మ్యాథ్స్ పేపర్-2బి మార్చి 11: ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్-2 మార్చి 13: ఫిజిక్స్-2 మార్చి 16: మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ-2 మార్చి 18: కెమిస్ట్రీ-2 మార్చి 23: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్-2
Details
జనవరి 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష
ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జనవరి 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23న అదే సమయానికి జరుగుతుంది. సెకండ్ ఇయర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు పూర్తయ్యాక హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.