LOADING...
Inter Exams: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఇంటర్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు
విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఇంటర్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు

Inter Exams: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఇంటర్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మార్చి 3న నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఈ ఒక్క పరీక్ష మినహా మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. మార్చి 3న హోలీ పండుగ నేపథ్యంలో ఆ రోజున జరగాల్సిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షను మరుసటి రోజైన మార్చి 4న నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Details

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు

వాస్తవానికి మొదట మార్చి 4న హోలీ పండుగ ఉంటుందని భావించిన అధికారులు, ఆ రోజున సెలవు ప్రకటించారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో మార్చి 3న హోలీ పండుగ సెలవు దినంగా ప్రకటించడంతో పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో మార్చి 3న జరగాల్సిన ఒక్కరోజు పరీక్షను వాయిదా వేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. కాగా తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25న ఫస్టియర్‌, 26న సెకండియర్‌ పరీక్షలు మొదలవుతాయి. సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్‌ను ఇప్పటికే ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. అన్ని పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement