Page Loader
పాక్ మహిళను రెండోపెళ్లి చేసుకున్న దావూద్, సంచలన విషయాలను వెల్లడించిన 'డాన్' మేనల్లుడు
పాక్ మహిళను రెండోపెళ్లి చేసుకున్న దావూద్ ఇబ్రహీం

పాక్ మహిళను రెండోపెళ్లి చేసుకున్న దావూద్, సంచలన విషయాలను వెల్లడించిన 'డాన్' మేనల్లుడు

వ్రాసిన వారు Stalin
Jan 17, 2023
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. మొదటి భార్య మైజాబిన్‌కు విడాకులు ఇవ్వకుండానే.. పాక్ పఠాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. అలాగే తాజాగా దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో తన నివాస స్థావరాన్ని కూడా మార్చినట్లు ఎన్ఐఏకు అలీషా పార్కర్ వివరించారు. కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక ఉన్న రహీమ్ ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాకు దావూద్ తన నివాస స్థావరాన్ని మార్చినట్లు చెప్పారు. దావూద్ భార్య మైజాబిన్‌ను జూలై 2022లో దుబాయ్‌లో తాను కలిశానని, అప్పుడే ఆమె రెండో పెళ్లి విషయం చెప్పిందని అలీషా ఎన్ఐఏకు చెప్పారు.

దావూద్

భారత్‌లోని బంధువులకు దావూద్ భార్య వాట్సాప్ కాల్

దావూద్ భార్య మైజాబిన్ పండగలకు తన భార్యకు ఫోన్ చేస్తుందని, భారత్‌లోని దావూద్ బంధువులకు ఆమె వాట్సాప్ కాల్ చేస్తుందని చెప్పారు. అయితే దావూద్ మాత్రం ఎవరితోనూ టచ్‌లో ఉండడరని అలీషా వెల్లడించారు. అలీషా పార్కర్ వాంగ్మూలం ప్రకారం.. దావూద్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. మొదటి కుమార్తె పేరు మారుఖ్ , మరొకరు మెహ్రిన్, మూడో కుమార్తె పేరు మజియా, కాగా.. కొడుకు మోహిన్ నవాజ్. దావూద్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు బయటకు చెబుతున్నాడు కానీ, వాస్తవానికి విడాకులు ఇవ్వలేదని ఆయన అలీషా చెప్పారు. దర్యాప్తు సంస్థల నిఘా మొదటి భార్య మైజాబిన్‌పై లేకుండా చేసేందుకు ఆయన ఇలా తప్పుడు వార్తను ప్రచారం చేసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.