ECI: సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఈసీ
లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఒడిశాలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని సీఈసీ తెలిపారు. ఒడిశాలో 50శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంటుందని సీఈసీ తెలిపారు. వికలాంగులు, యువత, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకసారి నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగవచ్చు. 2014లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ను ఈసీ 9దశల్లో నిర్వహించింది. 2019లో ఎన్నికలను 7దశల్లో పూర్తి చేసింది. మరి 2024ఎన్నికల్లో దశలను మరింత తగ్గిస్తుందా? లేక పెంచుతుందో చూడాలి.