
KTR: డీలిమిటేషన్‌పై అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలి : కేటీఆర్ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) డీలిమిటేషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌పై ప్రశ్నించకుంటే చరిత్ర తమను క్షమించదని హితవు పలికారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ అంశంపై డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది. డీలిమిటేషన్ కారణంగా తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంది.
కేంద్రం చూపించే అన్యాయంతో దక్షిణాది పూర్తిగా నష్టపోతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Details
సంఘీయ స్ఫూర్తికి విఘాతం
కేటీఆర్ డీలిమిటేషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు.
అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు ఇది తీవ్ర నష్టం కలిగించే విధానమని, అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దక్షిణాది రాష్ట్రాలకు నష్టం
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్నారు. అభివృద్ధి, ఆదాయం, జనాభా పెరుగుదల విషయంలో ముందున్న రాష్ట్రాలపై తీవ్రంగా ప్రభావం పడుతుందన్నారు.
ఈ విధానాన్ని అనుసరిస్తే అనేక రాజకీయ, ఆర్థిక నష్టాలు ఉంటాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపై రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.