Page Loader
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది : ఆదినారాయణ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది : ఆదినారాయణ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది : ఆదినారాయణ రెడ్డి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మూడు పార్టీల మధ్య పొత్తు ఉండాలనేది తన అభిప్రాయం అని, బీజేపీ అదిష్టానం కూడా ఈ మేరకు సంకేతాలను ఇచ్చిందని తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రి నారాయణ స్వామి కూడా పొత్తులపై స్పష్టతనిచ్చారని తెలిపారు. కేంద్రం సంకేతాలు లేకుండా తాను ఎందుకు మాట్లాడతానని అన్నారు. పొత్తుల విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, సీఎం జగన్‌కు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని పేర్కొన్నారు.

 Details

జగన్ కు కేంద్ర సహకారం లేదు

సీబీఐ కేసుల నుంచి సీఎంను బీజేపీ కాపాడుతోందనే ప్రచారంలో నిజం లేదని, వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ కోపంగానే ఉందని, సీఎం జగన్ ను కలుపుకొని ముందుకెళ్లే ప్రసక్తే లేదని ఆదినారాయణ చెప్పారు. శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా, విశాఖపట్నంలో అమిత్ షా వైసీపీ ప్రభుత్వ అవినీతిపై విమర్శలు గుప్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎవరో ఒకరు పొత్తులపై మాట్లాడుతుంటారని, దానిమీద తాను స్పందించాల్సిన అవసరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే.