Page Loader
జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 
జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

జులై 1నుంచి అమర్‌నాథ్ యాత్ర; నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 

వ్రాసిన వారు Stalin
Apr 17, 2023
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో 62రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌జీ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సోమవారం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. యాత్ర ఈ ఏడాది జూలై 1న ప్రారంభమై 2023 ఆగస్టు 31న ముగుస్తుందని ప్రభుత్వం తెలిపింది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ ట్రాక్ రెండింటికీ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన 316 బ్రాంచ్‌లు, జేకే 90 బ్రాంచ్‌లు, యెస్ బ్యాంక్ 37 బ్రాంచ్‌లు, ఎస్‌బీఐ బ్యాంక్ 99 బ్రాంచ్‌లతో సహా దేశవ్యాప్తంగా 542 బ్యాంక్ బ్రాంచ్‌లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

జమ్ము

ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి

ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్‌లో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఆధార్ ఆధారిత రిజిస్ట్రేషన్‌లో భాగంగా యాత్రికుల థంబ్ స్కాన్ తీసుకోబడుతుంది. మార్గదర్శకాల ప్రకారం, 13-70 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులు అమర్‌నాథ్‌జీ యాత్ర 2023 కోసం నమోదు చేసుకోవచ్చు. అన్ని తీర్థయాత్రల కోసం ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. 6వారాలకు మించిన గర్భం ఉన్న స్త్రీలకు కూడా అనుమతి ఉండదు. యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసినట్లు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.