Page Loader
భారత్ కోరితే తప్పక సహకరిస్తామని అమెరికా ప్రకటన.. విస్మయం వ్యక్తం చేసిన కాంగ్రెస్
మణిపూర్ అంశంపై భారత్ కోరితే తప్పక సహకరిస్తామన్న అమెరికా

భారత్ కోరితే తప్పక సహకరిస్తామని అమెరికా ప్రకటన.. విస్మయం వ్యక్తం చేసిన కాంగ్రెస్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 07, 2023
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత కొంత కాలంగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. మైతేయి, కుకీ మధ్య చోటు చేసుకున్న అసంతృప్తులు ఈశాన్యంలో కల్లోలం సృష్టించాయి. మరోవైపు స్కూళ్లు రీ ఓపెన్ చేసిన మరుసటి రోజే ఓ పాఠశాల వద్ద గుర్తు తెలియని మహిళను దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. దీనిపై భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టి స్పందించారు. భారత్ కోరితే తప్పక సహాయం అందిస్తామన్నారు. సదరు ఆందోళనలు వ్యూహాత్మకమైనవని కావని, అందులో మానవీయం ఉందన్నారు. హింసాత్మక ఘటనల్లో మహిళలు, చిన్నారులు చనిపోతుంటే, సాయం చేసేందుకు భారతీయులే కానక్కర్లేదన్నారు. భారత్ కోరితే తాము అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మణిపూర్‌లో వీలైనంత వేగంగా శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

details

అంతర్గత వ్యవహారాలకు అమెరికా సాయంపై కాంగ్రెస్ విస్మయం

అమెరికా సాయం ప్రకటనపై కాంగ్రెస్‌ స్పందించింది. 4 దశాబ్దాల ప్రజా జీవితంలో ఓ విదేశీ రాయబారి భారత అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం ఎన్నడూ చూడలేదని సీనియర్ నేత మనీశ్‌ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనేక దశాబ్దాలుగా పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో సవాళ్లను ఓర్పుతో, నేర్పుగా ఎదుర్కొన్నట్లు గుర్తు చేశారు. గత 2 నెలలుగా మణిపుర్‌ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. మరోవైపు అంతర్జాల వినియోగంపై ఆంక్షలు పెట్టి బలగాలను భారీగా మోహరించినప్పటికీ హింస చెలరేగుతోంది. శాంతి స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడుతూనే ఉండటం ఆందోళనకరం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మణిపూర్‌ అల్లర్లపై అమెరికా సాయం ప్రకటన