
మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు; సీఎం బీరెన్ సింగ్ అనుమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో చెలరేగుతున్న హింసపై ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర'ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
మే 3 నుంచి రాష్ట్రంలో చెలరేగుతున్న అల్లర్ల వెనుక విదేశీ హస్తం ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
జాతి ఘర్షణల ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరుగుతున్నట్లు అనిపిస్తోందని ఆయన చెప్పారు. మయన్మార్, చైనాతో మణిపూర్ సరిహద్దులను పంచుకుంటుందని వివరించారు.
398 కి.మీ దురంలో ఉన్న చైనా సరిహద్దులో భద్రతా బలగాలు మోహరించినా, పటిష్ట పర్యేవేక్షణ అనేది అసాధ్యమన్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈ విదేశీ శక్తుల హస్తాన్ని తిరస్కరించలేము, అలాగని గట్టిగా ధృవీకరించలేమన్నారు. అయితే ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసినట్లు స్పష్టమవుతోందని మణిపూర్ ముఖ్యమంత్రి చెప్పారు.
మణిపూర్
రాజకీయ కోణంలోనే రాహుల్ పర్యటన: సీఎం
రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు సీఎం బీరెన్ సింగ్ అన్నారు. 'క్షమిద్దాం, మరచిపోదాం' అంటూ 'కుకి సోదర సోదరీమణులతో' ఫోన్ మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు.
అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై కూడా బీరేన్ సింగ్ మాట్లాడారు. రాహుల్ గాంధీ పర్యటన రాజకీయ కోణంలో ఉందన్నారు.
అయితే ఈ సమయంలో రాష్ట్రానికి వచ్చే వారిని ఎవరిని ఆపలేమని, కానీ అతను ఇంతకుముందు ఎందుకు రాలేదు? ప్రశ్నించారు.
అతను కాంగ్రెస్ నాయకుడే, కానీ అతను ఏ హోదాలో పర్యటన చేసాడు? అడిగారు. మణిపూర్‌లో మైతీ, కుకీ వర్గాల మధ్య కొనసాగుతున్న జాతి ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మందికి పైగా మరణించారు.