Page Loader
స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు 
స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు 

వ్రాసిన వారు Stalin
Jun 14, 2023
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఉపాధి-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు. కోవిడ్ సమయంలో ఇంజనీర్‌గా ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, లింక్డ్‌ఇన్ వినియోగదారుల సహాయంతో కొత్త కొలువు సంపాదించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనాకు మందు జమ్మూకు చెందిన సాహిల్ సింగ్ బైజుస్‌లో పని పనిచేసేవాడు. కరోనా మహమ్మారి తారాస్థాయికి చేరుకోవడంతో,అతను తన స్వగ్రామానికి తిరిగి వచ్చి ఉద్యోగం కోల్పోయాడు. కరోనా కుదురుకున్నాక సాహిల్ సింగ్‌కు ఉద్యోగం దొరక్కపోవడంతో ఉపాధి కోసం స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయడం ప్రారంభించాడు.

కరోనా

ప్రియాంషి చందేల్ చేసిన పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో వైరల్

స్విగ్గీలో ప్రియాంషి చందేల్ అనే మహిళ చేసిన ఆర్డ్‌ర్‌ను డెలివరీ చేసేందుకు సాహిల్ వెళ్లాడు. అయితే అతను చాలా ఆలస్యంగా వెళ్లాడు. ఇంత ఆలస్యం ఎందుకైందని సాహిల్‌ను చందేల్ ప్రశ్నించింది. తన వద్ద బైక్ లేదని, కాలినడకన డెలివరీ ఇవ్వాల్సి రావడంతో ఆలస్యమైందని సాహిల్ వాపోయారు. తాను ఇంజనీరింగ్ చదివానని, అంతకుముందు బైజూస్ లో ఉద్యోగం చేసేవాడినని, కరోనా వల్ల జాబ్ పోయిందని చందేల్‌కు తన ధీనగాధను వివరించాడు. అనంతరం సాహిల్ దుస్థితిని వివరిస్తూ చందేల్ లింక్డ్‌ఇన్‌లో పోస్టు చేసింది.అలాగే అతని మార్క్‌షీట్, బి.టెక్ డిగ్రీతో సహా వివరాలను లింక్డ్‌ఇన్‌లో పొందుపర్చింది. ఈ పోస్టు వైరల్ కావడంతో అతని అర్హతకు తగిన ఉద్యోగాలు పోటెత్తాయి.అనంతరం సాహిల్ ఫుల్ టైమ్ జాబ్ లో సెటిలైపోయాడు.