Loading...
Vijay-Rahul Gandhi: రాజకీయంగా ఆసక్తికర పరిణామం.. విజయ్‌తో రాహుల్ గాంధీ గంటపాటు చర్చలు!
రాజకీయంగా ఆసక్తికర పరిణామం.. విజయ్‌తో రాహుల్ గాంధీ గంటపాటు చర్చలు!

Vijay-Rahul Gandhi: రాజకీయంగా ఆసక్తికర పరిణామం.. విజయ్‌తో రాహుల్ గాంధీ గంటపాటు చర్చలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో సమావేశమయ్యారు. విజయ్ నివాసంలో ఈ భేటీ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయ్‌తో గంటపాటు రాహుల్ చర్చలు రాహుల్ గాంధీ, విజయ్ దాదాపు గంటపాటు సమావేశమై పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం వీరిద్దరూ కలిసి సమీపంలోని ఓ కేఫ్‌కు వెళ్లారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ హోటల్‌కు తిరిగి వెళ్లారు. కాగా శనివారం సాయంత్రం చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల గళం) కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

వివరాలు

ఇండియా కూటమి నిరసనలకు టీవీకే దూరం..

కొన్నిరోజులుగా కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన విపక్ష నేతలు దేశ రాజధాని దిల్లీలో నిరసనలు చేపడుతున్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు.

టీవీకే పార్టీ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ.. దిల్లీలో జరుగుతున్న నిరసనలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తోంది.

ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరి భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT