Page Loader
భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం 
భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం

భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం 

వ్రాసిన వారు Stalin
Jun 13, 2023
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భోపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం 'సత్పురా భవన్‌'లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరగ్గా, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ప్రభుత్వ కీలక పత్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే మంటలను త్వరగా అదుపులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వైమానిక దళ సాయాన్ని కోరారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం మాట్లాడారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాల మేరకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు భోపాల్ చేరుకున్నాయి.

భోపాల్

ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం 

సత్పురా భవన్ పై నుంచి నీటిని పోయడం ద్వారా మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లు ప్రయత్నిస్తున్నాయి. అలాగే అగ్ని ప్రమాదం విషయంపై సీఎం చౌహాన్‌ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. సత్పురా భవన్ లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ప్రమాదం జరిగింది. సహాయక చర్యలను మంగళవారం ముగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.