Page Loader
World Food India: వ్యవసాయ రంగాన్ని ప్రపంచానికి చాటే అవకాశం.. ఏపీకి వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో చోటు! 
వ్యవసాయ రంగాన్ని ప్రపంచానికి చాటే అవకాశం.. ఏపీకి వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో చోటు!

World Food India: వ్యవసాయ రంగాన్ని ప్రపంచానికి చాటే అవకాశం.. ఏపీకి వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో చోటు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ ఫుడ్ ఇండియా-2025 (World Food India-2025) కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య భాగస్వామిగా పాల్గొననుంది. కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మహా ఆహార ఉత్సవం ఈ ఏడాది సెప్టెంబర్ 25 నుంచి 28 తేదీ వరకు న్యూదిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనడానికి అనుమతి ఇచ్చే ఉత్తర్వులను మంగళవారం విడుదల చేసింది. ఈ వేదికను వ్యవసాయ ఆధారిత రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశాలు, ముడి పదార్థాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సహాయక మౌలిక వసతులను ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది.

Details

రూ.1.271 కోట్ల మంజూరు

ఈ ప్రదర్శన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.271 కోట్లు బడ్జెట్‌ను మంజూరు చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ సోసైటీని నోడల్ ఏజెన్సీగా నియమించి స్టాల్స్, ప్రొడక్ట్ డెమోస్, ప్రెజెంటేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, రాష్ట్రం ప్రత్యేకతను ప్రపంచానికి చాటేందుకు ఇది కీలకమైన వేదికగా నిలవనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ వ్యవసాయ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న విస్తృత అవకాశాలను ప్రపంచానికి తెలియజేయడం, పెట్టుబడులకు దారితీయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.