కుమారుడి కోసం బానెట్‌పైకి దూకిన తల్లి.. ముగ్గురు పోలీసులు సస్పెండ్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ పట్ల పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కుమారుడి అరెస్టును అడ్డుకునేందుకు ఓ తల్లి ప్రయత్నించింది. ఆమె కొడుకును బలవంతంగా కారులో తరలిస్తున్నారనే కారణంగా బానెట్‌పైకి దూసుకెళ్లింది.
సదరు మహిళ కారు బానెట్ పై ఉండగానే పోలీసులు కారును అలాగే ముందుకు కదిలించారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల ప్రవర్తనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన నార్సింగ్‌పుర్ పరిధిలోని గొటెగావ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గొటెగావ్‌లోని కొందరు వ్యక్తులు మాదకద్రవ్యాలను కలిగి ఉన్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
DETAILS
ప్రజాగ్రహం పెల్లుబీకడంతో ముగ్గురు పోలీసులు సస్పెండ్
దీంతో సదరు కాలనీకి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దిరిలో ఆ మహిళ కుమారుడు ఉన్నాడు.
పూలు అమ్ముకొని బతికే ఆమె, కుమారుడి అరెస్టుతో ఆందోళనకు గరైంది. దీంతో వేగంగా పరుగెత్తుకొచ్చి కారు బానెట్‌పైకి దూకింది.
తన కుమారుడికి ఏ పాపం తెలియదని, అతడిని వదిలేయాలని అభ్యర్థించింది. పోలీసులు ఆమె మాటను అంగీకరించలేదు. దీంతో చేసేదేం లేక కారు బానెట్‌పైకి దూసుకెళ్లింది.అర కి.మీ దూరంలో ఉన్న ఠాణాకు పోలీసులు కారు ఆపకుండా అలాగే తీసుకెళ్లారు.
స్థానికులు ఈ దృశ్యాలను ఫోన్‌ల్లో వీడియో తీశారు. అది కాస్త వైరల్ గా మారి ప్రజాగ్రహం పెల్లుబీకింది.
దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.