బిల్‌గేట్స్‌ను కలిసిన ఆనంద్ మహీంద్రా; ఇద్దరూ క్లాస్‌మెట్స్ అని మీకు తెలుసా?
ఆనంద్ మహీంద్రా తన క్లాస్‌మెట్, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కలిశారు. ప్రస్తుతం గేట్స్ భారత పర్యటనలో ఉన్నారు. చాలా కాలం తర్వాత కలిసిన వీరద్దరూ తమ వ్యాపారాల గురించి కానీ, ఐటీ గురించి కానీ చర్చించలేదట. సమాజం గురించి, గేట్స్ పుస్తకం రాసిన పుస్తకం గురించి చర్చించినట్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బిల్ గేట్స్‌ను మళ్లీ చూడడం ఆనందంగా ఉందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. సామాజిక ప్రభావాన్ని గుణించడం కోసం ఎలా కలిసి పని చేయవచ్చనే దానిపై మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు. అయితే తాను ఈ సమావేశం సందర్భంగా కొంత లాభం పొందానని, బిల్ గేట్స్ రాసిన పుస్తకాన్ని అతని ఆటోగ్రాఫ్‌తో ఉచితంగా పొందానని ఆనంద్ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో క్లాస్‌మెట్స్
ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా రెండు ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వాటిలో ఒకటి గేట్స్ తన పుస్తకం 'ది రోడ్ ఎహెడ్'పై ఇచ్చిన ఆటోగ్రాఫ్. గేట్స్ స్వయంగా రాశారు. 'నా క్లాస్‌మేట్ ఆనంద్‌కి శుభాకాంక్షలు- బిల్ గేట్స్' అని పుస్తకంపై రాసి ఉంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆనంద్ మహీంద్రా, బిల్ గేట్స్ కలిసి చదువుకున్నారు. ఆనంద్ మహింద్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'వావ్! ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు నిజమైన హీరోలు!' అని ఒకరు కామెంట్ పెట్టగా, 'సమాజాన్ని మొత్తంగా మార్చే ప్రయత్నంలో రెండు రత్నాలు' మరొకరు వ్యాఖ్యానించారు.